ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

39 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. 40 మంది స్మగ్లర్లు పరార్ - చిత్తూరు జిల్లా క్రైమ్ వార్తలు

చిత్తూరు జిల్లాలోని శేషాచల అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం కూబింగ్ నిర్వహించింది. నిన్న 49 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు 39 దుంగలు పట్టుకున్నారు. నిన్న 39 మంది స్మగ్లర్లు తప్పించుకుంటే.. ఇవాళ 40 మంది తమిళ స్మగ్లర్లు పరారయ్యారు. అధికారులు వీరి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

red-sandalwood
red-sandalwood

By

Published : Dec 12, 2020, 9:35 AM IST

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మరోసారి ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు గుర్తించారు. అటవీశాఖ, పోలీస్, టాస్క్ ఫోర్స్ అధికారులు తాజాగా చేసిన తనిఖీల్లో.. చంద్రగిరి మండలం పరిధిలోని శేషాచలం అడవుల్లో భారీగా ఎర్ర చందనం పట్టుబడింది. శ్రీవారిమెట్టు ప్రాంతంలో సచ్చినోడిబండ వద్ద 40మంది తమిళ స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను తెస్తూ అధికారుల కంటబడ్డారు.

అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు దుంగలను పడవేసి దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. 39 ఎర్రచందనం దుంగలతో పాటుగా ఒక తమిళ స్మగ్లర్ ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details