చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలోని గంగమ్మ కోన వద్ద ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మెుత్తం పది చోట్ల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు వీలుగా స్మగ్లర్లు..డంపులను ఏర్పాటు చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎర్రచందనం ప్రత్యేకదళానికి చెందిన అధికారులు సోదాలు నిర్వహించారు. రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మురళీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో మెుత్తం 101 ఎర్రచందనం దుంగలను అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం డంప్ స్వాధీనం - chittoor district crimenews
చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలో ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మెుత్తం సోదాల్లో 101 ఎర్ర చందనం దుంగలను అధికారులు గుర్తించారు.
చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం డంప్ స్వాధీనం