ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడుల్లో పట్టుబడుతున్న ఎర్రచందనం దుంగలు... పారిపోతున్న స్మగ్లర్లు

శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు.. విచ్చలవిడిగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అయితే వీరికి తగ్గట్టుగానే పోలీసులు స్మగ్లర్ల ఎత్తుగడలను చిత్తు చేస్తూ అరెస్టు చేస్తున్నారు. తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి దుంగలను పట్టుకున్నారు.

దాడుల్లో దొరుకుతున్న ఎర్రచందనం దుంగలు...పారిపోతున్న స్మగ్లర్లు

By

Published : Nov 16, 2019, 11:42 AM IST

Updated : Nov 16, 2019, 2:09 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో అటవీశాఖ, పోలీసులు దాడులు నిర్వహించారు. యర్రావారిపాళ్యం మండలం, తిరుపతి రూరల్ మండలంలో అధికారుల దాడులలో 46 ఎర్రచందనం దుంగలను, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటుగా ముగ్గురు తమిళ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం ముమ్మరంగా అటవీ సమీప గ్రామాలలో తనిఖీలను చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

చంద్రగిరినియోజకవర్గంలో అటవీశాఖ దాడులు
Last Updated : Nov 16, 2019, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details