చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. గత మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న శేషాచల అడవులు స్మగ్లర్లతో నిండింది. గత కొన్నిరోజులుగా అటవీశాఖ అధికారులు అడవులలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. యర్రావారిపాళ్యం మండలంలోని అడవులలో స్మగ్లర్ల ఉనికి తెలియడంతో కూంబింగ్ ముమ్మరం చేశారు. తలకోన ఆటవీ ప్రాంతంలోని మర్రిమానుదడి వద్ద 14 మంది స్మగ్లర్లు తారసపడ్డారు.అధికారులను చూసి దుంగలను పడేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు. సమీప ప్రాంతాలను పరిశీలించిన అధికారులకు 13 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. భాకరాపేట అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు.
ఎర్ర చందనం స్మగ్లర్ అరెస్ట్..13 దుంగలు స్వాధీనం - red sandal smuggler arrest
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి మళ్లీ మెుదలయ్యింది. ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఒక స్మగ్లర్ను అరెస్టు చేసి.. ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్