ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత..17 మంది అరెస్టు - ఎర్రచందనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలను అన్నమయ్య జిల్లా చీపాటివారి పల్లె వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.

రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

By

Published : Jul 21, 2022, 7:12 PM IST

అన్నమయ్య జిల్లా పీలేరు మండలం మేళ్లచెరువు గ్రామం చీపాటి వారి పల్లె వద్ద.. అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల సమయంలో కార్లలో తరలిస్తున్న దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తమిళనాడుకి చెందిన 16 మంది కూలీలతో పాటు అయ్యప్ప అనే స్మగ్లర్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

శేషాచలం అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను బెంగళూరులోని రాజు భయ్యా అనే అంతర్జాతీయ స్మగ్లర్​కు చేరవేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజు భయ్యాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత మూడు నెలల కాలంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకోవడంతో పాటు 180 మంది కూలీలను అరెస్టు చేసామన్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details