నిఘా వర్గాల హెచ్చరిక.. తిరుపతిలో రెడ్ అలర్ట్ - terrorists
లష్కరే తోయిబా ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించారని నిఘావర్గాలు ప్రకటించటంతో ఆ రాష్ట్రంతో పాటు తిరుపతిలోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రతి వాహనాన్ని, ముఖ్య ప్రదేశాలను తనిఖీ చేస్తున్నారు.
సరిహద్దు రాష్ట్రం తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా సమాచారంతో తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్.... అనుమానస్పదంగా ఎవరూ కనిపించినా అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ మేరకు తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే మార్గాల్లో పోలీసులు తనీఖీలను ముమ్మరం చేశారు. రేణిగుంట, రామానుజ సర్కిల్, తనపల్లి రోడ్డు మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ప్రకటించారు.