చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3100కు చేరింది. ఈ రోజు నమోదైన 300 పాజిటివ్ కేసుల్లో... 44 తిరుపతి నగరంలో ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. మూడు రోజులుగా రోజుకు 200 కేసులు నమోదవుతుండగా... ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 300కు చేరింది. జిల్లాలో నమోదైన 3100 పాజిటివ్ కేసుల్లో వివిధ ఆసుపత్రుల నుంచి 1506 మంది కరోనాతో కోలుకొని డిశ్చార్జవ్వగా....1592 చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో అత్యధికంగా తిరుపతి నగరం నుంచి 600 పాజిటివ్ కేసులు నమోదవగా... 487 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రమవడంతో జిల్లా వ్యాప్తంగా 264 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. తిరుపతి నగరంలో 56 వార్డుల్లో 48 వార్డులను రెడ్‌జోన్ పరిధిలోకి చేర్చారు.
తిరుపతిలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు - చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు
చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఈ రోజు 300 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3100కు చేరింది.
తిరుపతిలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు..