చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పూర్తయినప్పటికీ సీబీఏస్‌ఈకి సంబంధించి 12వ తరగతి పరీక్షలు ఇంకా కొన్ని జరగాల్సి ఉంది. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా మే నెలలో నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు ప్రైవేట్ విద్యాసంస్థలు, అకాడమీలు పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ తరగతులను కూడా ప్రారంభించారు. వీటితోపాటు పదో తరగతి పరీక్షలూ జరగాల్సి ఉంది.
విద్యాసంవత్సరం ముగింపులో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో అన్ని రకాల వార్షిక , ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కడికక్కడ మూతపడ్డాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మరో వైపు ప్రవేశ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చే విద్యాసంస్థలపై తీవ్రప్రభావం చూపింది. ఈ మేరకు విద్యార్థులు రెండు వారాలుగా ఇంటి వద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు విద్యాసంవత్సరం నష్టపోకుండా తక్షణమే అన్ని రకాల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉంటూ ఆన్‌లైన్ బోధన అవలంభిస్తున్నారు.
విద్యార్థులు నష్టపోకుండా...