ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాలుడికి ఆర్థిక సాయం

పేగు సంబంధిత వ్యాధితో అవస్థ పడుతున్న ఓ బాలుడిపై ఈటీవీ భారత్ కథనం రాసింది. ఈ కథనానికి స్పందన లభించింది. స్థానిక వైకాపా నేత బాలుడి అవస్థను చూసి... వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేశారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాలుడికి ఆర్థిక సాయం
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాలుడికి ఆర్థిక సాయం

By

Published : Jul 13, 2020, 4:20 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన రమేశ్ - రాధ దంపతులకు ముగ్గురు సంతానం. వీరి రెండో కుమారుడు యుగంధర్ 2005వ సంవత్సరంలో జన్మించారు. యుగంధర్​కు చిన్నప్పుడు పేగు సంబంధిత ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ వికటించింది. గత 15 ఏళ్లుగా ఎన్ని సర్జరీలు చేసిన...యుగంధర్ ఆరోగ్యం కుదుటపడలేదు. ఆటో నడుపుతూ జీవనం సాగించే రమేశ్.. కొడుకు చికిత్స కోసం ఎంతో ఖర్చుచేశారు. అయినా లాభంలేకపోయింది.

యుగంధర్ అవస్థపై జులై 8న ఈటీవీ భారత్ కథనం రాసింది. ఈ కథనానికి స్పందించిన వైకాపా సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫరూఖ్ తన వంతు సాయాన్ని అందజేశారు. యుగంధర్ వైద్య ఖర్చులకు రూ.5 వేల నగదు ఇచ్చారు.

ప్రతి రోజూ నా బిడ్డ వైద్యానికి రూ.1500 ఖర్చు అవుతుంది. ఆటో తిప్పుతున్నా... కరోనా వల్ల గిరాకీ ఉండడంలేదు. మా అబ్బాయి గురించి ఈటీవీ భారత్ వార్త రాసింది. దానిపై స్పందించిన వైకాపా నేత ఫరూఖ్ తన వంతు సాయాన్ని అందించారు. సాయం చేసిన ఫరూఖ్ కి కృతజ్ఞతలు.--- రమేశ్, యుగంధర్ తండ్రి

ఇదీ చదవండి :'ఆర్టీసీ ఎండీ స్థానం నుంచి బదిలీ చేసినందుకు బాధ లేదు'

ABOUT THE AUTHOR

...view details