తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై ఆర్డీవో కనకనరసారెడ్డి విచారణ చేపట్టారు. ఆసుపత్రిని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడుతో కలిసి పరిశీలించిన ఆయన.. అక్కడి ఆక్సిజన్ ట్యాంక్ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతితో పాటు ఆ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న నర్సుల నుంచి ఏం జరిగిందనే అంశాలపై వివరాలు సేకరించారు. మే 10న రాత్రి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రుయా అసుపత్రి ఘటనపై ఆర్డీఓ విచారణ - రుయా ఆసుపత్రిఘటనపై ఆర్డీఓ విచారణ
తిరుపతి రుయా ఆసుపత్రి విషాద ఘటనపై ఆర్డీఓ విచారణ చేపట్టారు. ఆయనతోపాటే ఎస్పీ ఆసుపత్రిని పరిశీలించారు. నర్సులు, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రుయా ఆసుపత్రిఘటనపై ఆర్డీఓ విచారణ