కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సరుకుల కోసం చిత్తూరు జిల్లా ప్రజలు ఉదయం నుంచే రేషన్ డిపోల వద్ద బారులు తీరారు. సామాజిక దూరం పాటించేలా గడులను గీసి జాగ్రత్తలు తీసుకున్నారు. రేషన్ దుకాణాల వద్ద సబ్బుతో చేతులు కడుక్కుని శుభ్రపరుచుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మారుమూల ప్రాంతాల్లో మాత్రం సామాజిక దూరంపై ప్రజల్లో అవగాహన కొరవడింది. అధికారులు సైతం చాలా చోట్ల నిర్లిప్తతతో వ్యవహరించారు. ప్రజలు మాములుగానే క్యూలైన్లలో సరుకుల కోసం గంటల తరబడి వేచి చూశారు. ఎండ విపరీతంగా ఉండగా.. చాలా చోట్ల వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. పీలేరు నియోజకవర్గంలో సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు సరుకులు తీసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో సజావుగా రేషన్ సరుకుల పంపిణీ - lock down chitoor dst latest updats
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చౌకధరల దుకాణాల్లో సరకులు పొందేందుకు ప్రజలు బారులు తీరారు. జిల్లాలో మొత్తం 2,901 చౌక ధరల దుకాణాల్లో 11 లక్షల 33 వేల రేషన్ కార్డుదారులకు సరకులు అందిస్తున్నారు.
![చిత్తూరు జిల్లాలో సజావుగా రేషన్ సరుకుల పంపిణీ ration rice distribution in chittoor dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6584553-669-6584553-1585481334232.jpg)
చిత్తూరులో సజావుగా సాగిన రేషన్ సరుకుల పంపిణీ
చిత్తూరు జిల్లాలో సజావుగా సాగిన రేషన్ సరుకుల పంపిణీ
ఇదీ చూడండి: