చిత్తూు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని రేషన్ దుకాణం డీలర్ల సంఘం పిలుపు మేరకు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ఎనిమిది నెలలుగా కనీస వేతనాలు చెల్లించలేదంటూ ఆ సంఘం అధ్యక్షుడు చక్రవర్తి పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజలకు సేవ చేశామని ఆయన అన్నారు. అలాంటి తమకు వేతనాలు ఇవ్వకపోగా... అధికారుల వేధింపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకుని రేషన్ డీలర్లకు న్యాయం చేయాలంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ యుగంధర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఎమ్మార్వో కార్యాలయం వద్ద రేషన్ డీలర్ల సంఘం నిరసన
చంద్రగిరి ఎమ్మార్వో కార్యలయం వద్ద రేషన్ దుకాణం డీలర్ల సంఘం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమ ఇవ్వలవలసిన కనీస వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉప తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఉప తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసిన రేషన్ దుకాణం డీలర్ల సంఘం