తిరుపతికి చెందిన సరస్వతి రెడ్డి... ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటున్న శునకం రోడ్డు ప్రమాదానికి గురైంది. 2019 లో జరిగిన ఈ ఘటనలో శునకం వెనుక కాళ్ల ఎముకలు విరిగిపోయాయి. దానికి చికిత్స అందించేందుకు జిల్లాలోని పలు పశు వైద్యులను సంప్రదించినప్పటికీ... ప్రయోజనం లేకుండా పోయింది. రోజు రోజుకు టామీ (శునకం) ఆరోగ్యం దీనస్థితికి చేరుకొంటున్న క్రమంలో... శ్రీ వేంకటేశ్వర పశువైద్య బోధనాసుపత్రిలో చేర్చారు.
పెంపుడు శునకానికి యాక్సిడెంట్.. ఆపరేషన్ చేసి కాపాడిన ఆసుపత్రికి యజమాని విరాళం
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని బోధనాసుపత్రిలో ఓ పెంపుడు శునకానికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. తన టామీకి ఆరోగ్యాన్ని అందించిన వైద్యులను శునక యజమాని అభినందించి రూ. 25,000 విరాళం అందించారు.
పెంపుడు శునకానికి అరుదైన శస్త్రచికిత్స
పశువైద్య కళాశాల శస్త్రచికిత్స విభాగ నిపుణులు... డాక్టర్ రఘునాథ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంటర్ లాకింగ్ నెయిలింగ్ విధానంలో టామీకి శస్త్రచికిత్స చేశారు. విదేశాల్లో మాత్రమే సాధ్యమనుకున్న అరుదైన శస్త్ర చికిత్స అందించి.. తనకు ప్రాణప్రదమైన టామీకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన వైద్యుల ప్రతిభను గుర్తించి సరస్వతిరెడ్డి రూ. 25,000 విరాళంగా ఇచ్చారు.
ఇదీచదవండి.
సింహాచలం శాశ్వత ఈవో నియామకంపై అంతులేని జాప్యం
Last Updated : Dec 5, 2020, 6:56 PM IST
TAGGED:
rare surgery in thirupathi