ముఠా సభ్యులు.. ఈ పామును తమిళనాడుకు చెందిన పాండురంగన్ గోపాల్ అనే వ్యక్తికి విక్రయించడానికి సిద్ధం చేసినట్లు విచారణలో కనుగొన్నారు. ఈ కేసులో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 13 మంది సభ్యులను అటవీ అధికారులు అరెస్టు చేశారు. వీరితో పాటు ఒక టవేరా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగున్నర కిలోల బరువు ఉన్న అరుదైన పూడు(రెండు తలల) పాములు భారత్, పాకిస్థాన్, ఇరాన్ దేశాల్లో మాత్రమే లభిస్తాయి.
SNAKE SMUGGLERS ARREST: అరుదైన పాముల అక్రమ రవాణా ముఠా అరెస్టు - చిత్తూరు జిల్లా నేర వార్తలు
SNAKE SMUGGLERS ARREST: అరుదైన పాములను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ అధికారులు చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నాలుగున్నర కిలోలున్న పూడు(రెండు తలల) పామును స్వాధీనం చేసుకున్నారు.
![SNAKE SMUGGLERS ARREST: అరుదైన పాముల అక్రమ రవాణా ముఠా అరెస్టు SNAKE SMUGGLERS ARREST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13903127-657-13903127-1639478236065.jpg)
SNAKE SMUGGLERS ARREST
అరుదైన పాముల అక్రమ రవాణా ముఠా అరెస్టు