Rape on blind women: అంధ యువతిపై ఓ వివాహితుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న కొండమిట్టలో బాధిత అంధ యువతి కుటుంబం నివాసం ఉంటోంది. యువతి తండ్రి చాలాకాలం కిందట మృతి చెందాడు. బాధిత యువతి నివాసం సమీపంలోనే ఉంటున్న.. ఓ రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు జయచంద్రా రెడ్డి అలియాస్ చిన్నా.. కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన ఓ అంధ యువతికి మాయ మాటలు చెప్పి.. చిన్నా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై.. బాధితురాలి తల్లి దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారు కేసు నమోదు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.