చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మతిస్థిమితం సరిగ్గా లేని బాలిక (14) గ్రామంలో ఒంటరిగా ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన నాదముని మామిడి కాయలు కోసి ఇస్తానని గ్రామ సమీపంలోని మామిడితోటకు తీసుకు వెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న గ్రామస్థులు అతనిపై రాళ్ల విసురుతూ కేకలు వేశారు. నాదముని అక్కడి నుంచి తప్పించుకొని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.
బాలికపై అత్యాచారయత్నం..అడ్డుకున్న గ్రామస్థులు - child rape in chittoor dst
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఓ బాలికపై 35 సంవత్సరాల వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయటంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
rape attempt on minor girl in chittoor dst chandragiri madnal