ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీవారి దర్శనాలు నిలిపివేయండి'.. రమణ దీక్షితులు మరో ట్వీట్ - taja news of tirumala covid cases

తిరుమలలో శ్రీవారి దర్శనాలను నిలుపదల చేయాలని తితిదే సలహా మండలి గౌరవాధ్యక్షుడు రమణ దీక్షితులు మరోసారి ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నందున స్వామి వారి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించాలన్నారు.

ramana diskthulu tweeted  about srivari darshna must be cancel due to increasing corona cases
ramana diskthulu tweeted about srivari darshna must be cancel due to increasing corona cases

By

Published : Jul 18, 2020, 7:09 AM IST

Updated : Jul 18, 2020, 8:32 AM IST

తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఇప్పటికైనా శ్రీవారి దర్శనాలను నిలుపదల చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ట్విటర్ వేదికగా తితిదే సలహా మండలి గౌరవాధ్యక్షుడు రమణ దీక్షితులు కోరారు. శ్రీవారి అర్చకుల స్థానం ఎవరూ భర్తీ చేయలేనిదని, వారి ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా దర్శనాలను నిలుపుదల చేయాలని తెలిపారు. ఏకాంతంగా ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి కైంకర్యాలు ఒకరోజు కూడా ఆగడానికి వీల్లేదని ఇది మానవజాతికి మంచిది కాదని పేర్కొన్నారు. కొన్నివారాలపాటు దర్శనాలను నిలుపుదల చేసి శ్రీవారి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించాలని కోరారు.

Last Updated : Jul 18, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details