మూడు రాజధానులకు మద్దతుగా మదనపల్లిలో ర్యాలీ - latest news on three capital
మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నవాజ్ భాష నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి బెంగళూరు బస్టాండ్ కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారని నవాజ్ భాష అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.