ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భరోసా కేంద్రాలతో రైతుల ముంగిట్లోకే సేవలు' - rbk centers in chittoor dist

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో 70 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. వాల్మీకిపురంలో మాస్టర్ హబ్​ను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు విస్తృత సేవలను అందిస్తున్నట్లు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

raithu bharosa services at near to farmers
రైతుల వద్దకే రైతు భరోసా సేవలు

By

Published : May 30, 2020, 7:23 PM IST

రైతులు భరోసా కేంద్రాలకు వెళ్లి కియోస్క్ ద్వారా తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పరికరాలకు ఆర్డర్ ఇస్తే చాలని... అవి అన్నదాతల ముంగిటకే వస్తాయని.. చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 70 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా నకిలీ, కల్తీ ఉత్పత్తుల విక్రయాలను నిరోధించే వీలుంటుందన్నారు.

భరోసా కేంద్రాల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులపై, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారన్నారు. సాగు పరికరాలను తక్కువ అద్దెకు అందజేస్తారని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఇదీ చదవండి:'రైతులకు భరోసా ఇచ్చేందుకే కేంద్రాలు'

ABOUT THE AUTHOR

...view details