చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం, చంద్రగిరి మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరి సాగు చేసేందుకు అవరసమైన సాగునీరు అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటు ఆనందం... అటు విచారం - చంద్రగిరి నియోజకవర్గంలో వర్షాలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వర్షాలు పడటంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఓ పక్క రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరో పక్క లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో వర్షాలు
చంద్రగిరి మండలం ఏ.రంగంపేట దుర్గం ఎస్టీ కాలనీలో మోకాలు లోతు వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికంగా కొన్ని ఇళ్లులు కూలటానికి సిద్ధంగా ఉన్నాయి. వర్షపు నీరు నిలిచి ఉండిపోవటంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: ఒక్కరోజులో ముగిసిన మహాభారత మహోత్సవం !