చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని ఉడుమువారిపల్లి వద్ద క్వారీ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. భారీ వాహనాల రాకపోకల ద్వారా గ్రామంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా వాటిని నడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల కారణంగా.. గ్రామంలో రైతులకు, పశువులకు ఇబ్బంది అవుతోందని.. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.