చిత్తూరు జిల్లా పీటీఎం మండలం పులికంటివారిపల్లెలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈశ్వరయ్య అనే రైతు తన గొర్రెలను ఇతరుల పొలంలోకి తోలడంతో ఈ వివాదం తలెత్తింది. పరస్పరం కొడవళ్లతో దాడి చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో గణేశ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇరువర్గాల ఘర్షణ... ఒకరి పరిస్థితి విషమం - చిత్తూరు జిల్లా నేటి వార్తలు
చిత్తూరు జిల్లా పులికంటివారిపల్లెలో ఘర్షణ జరిగింది. కొడవళ్లతో దాడి చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇరువర్గాల ఘర్షణ... ఒకరి పరిస్థితి విషమం