చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఆముదాలపుత్తూరు గ్రామంలో మంగళవారం రాత్రి సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన కొండచిలువ గ్రామస్తుల చేతిలో హతమైంది. రాత్రి సమయంలో భారీ కొండచిలువ గ్రామంలో తిరుగుతూ స్థానికులను భయందోళనకు గురిచేసింది. అటవీ ప్రాంతంలోకి కొండ చిలువను తరిమేందుకు గ్రామస్థులు విఫలయత్నం చేశారు. రాత్రి వేళ మళ్లీ గ్రామంలోకి ప్రవేశిస్తుందన్న భయంతో సర్పాన్ని హతమార్చారు.
గ్రామస్థుల చేతిలో కొండచిలువ హతం - పాలకొండ మండలంలో కొండచిలువ హతం
చిత్తూరు జిల్లా అముదాలపుత్తూరు గ్రామంలో సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ కొండచిలువ వచ్చింది. భయందోళనకు గురైన గ్రామస్థులు కొండచిలువను హతమార్చారు.
గ్రామస్తుల చేతిలో హతమైన కొండచిలువ