ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండచిలువ ఆకలి తీరలేదు... జింక ప్రాణం నిలవలేదు...

పాపం జింక దాహార్తిని తీర్చుకునేందుకు అక్కడికి వచ్చింది. ఇంతలో కొండచిలువ ఆ మూగజీవిపై దాడి చేసింది. జింక పోరాడింది కానీ ప్రాణాలు దక్కించుకోలేకపోయింది. విగతజీవిగా పడి ఉన్న జింకను మింగేందుకు విఫలయత్నం చేసి వీలుకాక చిలువ అడవిలోకి వెళ్లిపోయింది.

కలిగిరి వెంకన్న ఆలయ పరిసరాల్లో  'కొండచిలువ'

By

Published : Nov 1, 2019, 10:34 AM IST

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి కొండ పరిసరాల్లో కొండచిలువ కనిపించింది. నీరు తాగడానికి ఆలయం వద్దకు వచ్చిన జింకపిల్లపై ఆ భారీ సర్పం దాడి చేసి మింగడానికి ప్రయత్నించింది. జింక-కొండచిలువ మధ్య పోరు జరిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ మూగజీవి చేసిన ప్రయత్నం విఫలమైంది. చనిపోయిన జింకను మింగేందుకు కొండచిలువ విఫలయత్నం చేసింది. సాధ్యం కాకపోయేసరికి జింకను వదిలి అడవిలోకి వెళ్లిపోయింది. కొంతమంది భక్తులు ఈ దృశ్యాలను చరవాణిలో బంధించారు.

కలిగిరి వెంకన్న ఆలయ పరిసరాల్లో 'కొండచిలువ'
ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details