ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి. సింధు తన తల్లిదండ్రులతో తిరుమలకు చేరుకున్నారు. జీఎంఆర్ అతిథి గృహంకు చేరుకున్న ఆమె కుటుంబానికి...డిప్యూటీ ఈవో బాలాజీ స్వాగతం పలికారు. అంతకు ముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారు, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేకం సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమలకు 'స్వర్ణ' సింధు..ఉదయం స్వామివారి దర్శనం! - జీఎంఆర్ అతిథి గృహం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి. సింధు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనుంది. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న 'స్వర్ణ' సింధు