PUSHPA YAGAM: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం కన్నుల పండువగా సాగింది. ఉదయం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అర్చకులు.. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. దాతలు సమర్పించిన 3.5 టన్నుల పుష్పాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు.
అర్చకుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి నిర్వహించారు.