పంచాయతీకి నిధులు నిలిపివేయడంతో చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీ సర్పంచ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిధులు లేని కారణంగా పది రోజులుగా పంచాయతీ అధికారులు చెత్త ట్రాక్టర్లు నిలిపివేయడంతో సర్పంచ్ బడి సుధాయాదవ్... గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించారు. కరోనా సమయంలో పంచాయతీకి నిధులు ఆపడమేమిటంటూ నిరసన తెలిపారు. తనకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు.
నిధులు రాక.. ఇంటింటికీవెళ్లి చెత్త సేకరణ..
పంచాయతీకి నిధులు నిలిపివేసినందుకు నిరసనగా ఓ సర్పంచ్... ఇంటింటికెళ్లి చెత్త సేకరిస్తున్నారు. తనకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే చెత్త సేకరిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
నిధులు రాక సర్పంచి ఇబ్బందులు.. ఇంటింటికెళ్లి చెత్త సేకరణ..
స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినందునే నిధులు విడుదల చేయకుండా తనను వేధిస్తున్నారని సుధాయాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి పంచాయతీలోని సమస్యలకు ఖర్చు చేసినట్లు వివరించారు. వారం రోజులుగా పంచాయతీలో చెత్త సేకరణ ఆపారని... ఇప్పటికైనా అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజలతో కలసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:డెంగీతో తండ్రి, కుమారుడు మృతి
Last Updated : Sep 29, 2021, 1:45 PM IST