ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయవాది దంపతుల హంతకులకు ఉరి శిక్ష పడాలి'

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి న్యాయస్థానం ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలోని పెద్దపల్లిలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు.

lawyers protest
శ్రీకాళహస్తిలో న్యాయవాదుల నిరసన

By

Published : Feb 18, 2021, 9:35 PM IST

తెలంగాణలోని పెద్దపల్లిలో న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్యను ఖండిస్తూ.. శ్రీకాళహస్తిలో న్యాయవాదులు నిరసన చేశారు. శ్రీకాళహస్తి కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. నడిరోడ్డుపై న్యాయవాది దంపతులను హత్య చేయడం దారుణమన్నారు. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ రెండు రోజులపాటు విధులను బహిష్కరించామని చెప్పారు. నిందితులకు ఉరి శిక్ష పడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details