వారపు సంతలో ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తూ... చిత్తూరు జిల్లా మదనపల్లెలో అఖిలపక్ష నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. తెదేపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులతోపాటు చిరువ్యాపారులూ ఆందోళనలో పాల్గొన్నారు. తక్షణమే ఆక్రమణలు తొలగించి, చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే నవాజ్ భాష.. సమస్యను పరిష్కరించకుండా మరింత జటిలం చేస్తున్నారని మండిపడ్డారు. సమస్య పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు... నిరసనకారులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఉద్రిక్తంగా మారిన మదనపల్లె ఆందోళన
చిత్తూరు జిల్లా మదనపల్లెలో తెదేపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు, చిరువ్యాపారులు ఆందోళన చేశారు. వారపు సంతలో ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు.
ఉద్రిక్తంగా మారిన మదనపల్లె ఆందోళన