వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చి, తక్షణ సాయం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరుతూ... తిరుపతిలో ఏఐటీయూసీ నాయకుడు మురళి డిమాండ్ చేశారు. భవన నిర్మాణ, హమాలి, రవాణా తదితర రంగాలకు చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలని డిమాండ్ చేశారు.
'వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలి' - తిరుపతిలో ఏఐటీయూసీ నిరసన
లాక్డౌన్ కారణంగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోవడంతో వారి ఇక్కట్లు మరింత తీవ్రం అయ్యాయి. అలాంటివారిని స్వస్థలాలకు పంపి, పదివేల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
'వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలి'