మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో నిలిచిన ఉత్పత్తి - power
సాంకేతికలోపంతో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన నిలిచింది. దీని వల్ల వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.
మాచ్‌ఖండ్
ఎట్టకేలకు అధికారులు నిన్న రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు శ్రమించి లోపాన్ని సరిదిద్ది విద్యుత్ సరఫరా బాక్ ఫీడింగ్ ద్వారా పునరుద్ధరించారు. నిన్నటినుంచి ఇవాళ ఉదయం 11.30 వరకు విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడం వలన ప్రతి గంటకు 82 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నష్టం వాటిల్లింది. 6 దశాబ్దాల చరిత్ర ఉన్న మాచ్‌ఖండ్‌లో ఎప్పుడు ఎటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. ప్రస్తుతం అధికారులు దశల వారీగా జనరేటర్లను వినియోగంలోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.