ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగిరి నియోజకవర్గంలో ప్రైవేట్ డ్రైవర్ల నిరసన - సీపీఐ నేతలు,

నగిరి నియోజకవర్గంలో ప్రైవేట్ డ్రైవర్లు నిరసనకు దిగారు. కరోనా కాలంలో ఫైనాన్స్​ బకాయిలను రద్దు చేయాలని కోరారు. రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నినాదాలు చేశారు.

Private drivers protest
ప్రైవేట్ డ్రైవర్లు నిరసన

By

Published : Nov 23, 2020, 5:59 PM IST

చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ప్రైవేట్ డ్రైవర్లు, ఏఐటీయూసీ పుత్తూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనా కాలంలో ఆదాయం కోల్పోయామని, అప్పటి ఫైనాన్స్​ బకాయిలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. డ్రైవర్లకు రూ.10వేల చొప్పున అందించి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసనలో సీపీఐ నేతలు, ప్రైవేట్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details