హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి.. బోల్తాపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా, మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాళహస్తిలోని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏర్పేడు పోలీసులు, ప్రమాదం గురించి విచారణ చేపట్టారు.
బస్సు బోల్తా.. ముగ్గురికి స్వల్ప గాయాలు - చిత్తూరు న్యూస్
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ఘటన జరిగింది.
![బస్సు బోల్తా.. ముగ్గురికి స్వల్ప గాయాలు Private bus overturns at formation zone in Chittoor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10067795-565-10067795-1609405938290.jpg)
బస్సు బోల్తా.. ముగ్గురికి స్వల్ప గాయాలు