సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమ సందర్శన కోసం...చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో మదనపల్లె మండలం చిప్పిలికి వచ్చిన కోవింద్‌కు...ముఖ్యమంత్రి జగన్, మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి... స్వాగతం పలికారు. అనంతరం నక్కలదిన్నె సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్‌కి వెళ్లారు.
ఆశ్రమంలోని భారత్ యోగ విద్యా కేంద్రం, యోగశాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రారంభించారు. ఆశ్రమ వాసులు, యోగా శిక్షకులతో కాసేపు ముచ్చటించి...వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. 38 పడకలతో నిర్మించనున్న స్వాస్థ్య ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సత్సంగ్ విద్యాలయ విద్యార్థులతో రాష్ట్రపతి సరదాగా గడిపారు.