రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 15 మండలాల్లోని మొత్తం 60,016 మంది లబ్ధిదారుల తుది జాబితాను ప్రచురించినట్లు తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి కనక నరసారెడ్డి 'ఈటీవీ భారత్' కి తెలిపారు.
ఇందుకు 1340 ఎకరాల భూమి అవసరం కాగా, 820 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. మిగిలిన భూమిని భూసేకరణ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. తిరుపతిలోని లబ్ధిదారులకు భూమి అందుబాటులో లేకపోవడంతో చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని సూరప్పకశం, జి.పాలెం, వడమాలపేట, చిందేపల్లి, ముంగిలిపట్టు ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు.
- మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు..
తిరుపతి అర్బన్- 23,697
తిరుపతి గ్రామీణ- 9,842
శెట్టిపల్లి- 2,261
చంద్రగిరి- 3,297
పాకాల- 1,937
ఏర్పేడు- 1,647
రేణిగుంట- 5,335