ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదనపు కట్న వేధింపులకు.. నిండు గర్భిణి బలి - chittor

వరకట్న వేధింపులకు నిండు గర్భిణి బలైన అమానవీయ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం జంగలపల్లెలో చోటుచేసుకుంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ... భర్తే భార్యను  తాడుతో గొంతు బింగించి కిరాతంగా హత్య చేశాడు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నిందితుడు.. పరారీలో ఉన్నాడు.

గర్భణి బలి

By

Published : Aug 25, 2019, 2:05 PM IST

Updated : Aug 25, 2019, 4:34 PM IST

చిత్తూరు జిల్లా జంగలపల్లె గ్రామానికి చెందిన మృతురాలు మీనాను కట్టుకున్న భర్తే.. దారుణంగా హతమార్చాడు. ఒడ్డూరు గ్రామానికి చెందిన నారాయణతో 5 ఏళ్ల కిందట మీనాకు వివాహమైంది. పెళ్లి సందర్భంగా మూడు లక్షల నగదుతో పాటు రెండు లక్షల విలువైన బంగారు అభరణాలు కట్నం కింద ముట్టజెప్పారు. బలాదూర్​గా తిరిగే నారాయణ నిత్యం అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. పలుమార్లు మీనా తల్లిదండ్రులు డబ్బు ఇచ్చినా...అతనిలో ఆశ చావలేదు. వారికి 18 నెలల వయస్సున్న కుమార్తె ఉండగా...ఇప్పడు మీనా 9 నెలల గర్భణీగా ఉంది. ప్రసవం కోసం ఆమె బంగాలపల్లిలో ఉండే తాత అవ్వల ఇంటికి రాగా...గత రాత్రి అక్కడుకు చేరుకున్న నారాయణ డబ్బుకోసం ఆమెతో మరో మారు గొడవడ్డాడు. అనంతరం రాత్రి నిద్రిస్తున్న సమయంలో నిండు గర్భిణి అన్న విషయాన్ని మరిచిపోయి.. మానవమృగంలా ప్రవర్తించాడు. మీనా మెడకు తాడుతో బింగించి కిరాతంగా హత్య చేశాడు.

నిండు గర్భిణి బలి

ఏమీ తెలియనట్లు...

రాత్రి మీనాను హత్య చేసిన నారాయణ ఏమి తెలియనట్లుగా...తన భార్యకింద పడిపోయిందని వాళ్ల అవ్వను నమ్మించే ప్రయత్నం చేశాడు. వారు వెళ్లి సరికి ... ఆమె మృతి చెంది ఉంది. బయటకు వచ్చి చూడగా..నిందితుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి

మందు బాబును.. నేను మందు బాబును..!

Last Updated : Aug 25, 2019, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details