చిత్తూరు జిల్లాలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు బీ.కొత్తకోట మండల పరిధిలోని బడికాయలపల్లి పెద్ద చెరువు నిండి ప్రవహిస్తోంది. ఫలితంగా గతంలో ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన ప్రజలు స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో చెరువు కట్టపై ఉన్న గంగమ్మకు స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గంగమ్మకు పూజలు... ఘనంగా తెప్పోత్సవం
కొన్ని దశాబ్దాల పాటు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరవు కరాళనృత్యం చేసేది. రైతులు, కూలీలు, వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులు పట్టణాలకు వలస బాట పట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. గతేడాది కురిసిన వర్షాలకు నియోజకవర్గంలోని చెరువులు, జలాశయాలు నిండాయి. ఫలితంగా పశుపక్ష్యాధులు, పంటపొలాలతో పల్లెలు సస్యశ్యామలంగా మారాయి.
బడికాయలపల్లిలో తెప్పోత్సవం