చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఎమ్మార్వో కార్యాలయం అంధకారంగా మారింది. కొన్ని నెలలుగా కార్యాలయ విద్యుత్తు బిల్లులను చెల్లించలేదు అధికారులు. దీనివల్ల 7,25,000 రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. చివరకు కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను శుక్రవారం నిలిపివేశారు ఆ శాఖ అధికారులు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్తు పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. ఇన్వర్టర్ పవర్ ఉన్నంత వరకు పని చేసిన కార్యాలయ సిబ్బంది... అనంతరం చేతులెత్తేశారు. సేవలు నిలిచిపోవటంతో కార్యాలయానికి వస్తున్న అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎమ్మార్వో కార్యాలయానికి విద్యుత్తు సరఫరా నిలిపివేత - చంద్రగిరి ఎమ్మార్వో కార్యాలయం వార్తలు
లక్షల రూపాయల విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవటంతో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఎమ్మార్వో కార్యాలయానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అంధకారంలోనే అధికారులు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యాలయం కొన్ని నెలలుగా విద్యుత్తు బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది.
MRO office in Chandragiri