ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరులో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ - pottisriramulu-statue-in-chithoor

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని చిత్తూరులోని గంగినేని చెరువు ఉద్యానవనంలో ఆవిష్కరించారు.

pottisriramulu-statue-in-chithoor
చిత్తూరులో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

By

Published : Feb 29, 2020, 8:37 PM IST

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

చిత్తూరులోని గంగినేని చెరువు ఉద్యానవనంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు, పూతలపట్టు శాసన సభ్యుడు ఎంఎస్​ బాబు కలిసి ఆవిష్కరించారు. బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ వి.సుందరనాయుడు విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షుడిగా ఉండి విగ్రహ ఆవిష్కరణకు కృషి చేశారు.

తెలుగు మాట్లాడేవారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టిశ్రీరాములు.. తెలుగు జాతి పితామహుడిగా నిలిచారని డాక్టర్ సుందరనాయుడు అన్నారు. ఈ ఉద్యానవనానికి పొట్టి శ్రీరాములు ఉద్యానవనంగా పేరు పెట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసుకు సుందర నాయుడు విజ్ఞప్తి చేశారు. అనంతరం విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ఆయన్ను సత్కరించారు.

ఇదీ చదవండి:

తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details