తిరుపతి నగరపాలక సంస్థ రెండో వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో వైకాపా అభ్యర్థి అనుచరులతో పాటు పోలింగ్ సిబ్బంది రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు తెదేపా అభ్యర్థి సాహితి యాదవ్ ఆరోపించారు. ఓటేసేందుకు వెళ్లిన ఒక్కో వ్యక్తికి రెండు బ్యాలెట్ పత్రాలు ఇస్తున్నారని పోలింగ్ కేంద్రంలోనే ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రానికి చెరుకొన్న తెదేపా నేత నరసింహ యాదవ్..ఓటరు వద్ద ఉన్న రెండు బ్యాలెట్ పత్రాలను తీసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పోలింగ్ ఆగిపోయింది.
ఒక్కో వ్యక్తికి రెండు బ్యాలెట్ పత్రాలు.. నిలిచిపోయిన పోలింగ్ - చిత్తూరులో తెదేపా వార్తలు
తిరుపతి నగరపాలక సంస్థ రెండో వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. ఓటరు వద్ద ఉన్న రెండు బ్యెలెట్ పత్రాలను తీసుకొని అభ్యర్థితో కలసి తెదేపా నేత నరసింహ యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
![ఒక్కో వ్యక్తికి రెండు బ్యాలెట్ పత్రాలు.. నిలిచిపోయిన పోలింగ్ polling has stopped in the second ward of the tirupati municipal corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10952183-257-10952183-1615384257671.jpg)
ఒక్కో వ్యక్తికి రెండు బ్యాలెట్ పత్రాలు... నిలిచిపోయిన పోలింగ్
అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవటంతో పాటు రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెదేపా నేత నరసింహ యాదవ్ ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి