VIPS AT TIRUMALA: కలియుగ దైవమైన తిరుమల ఏడుకొండల స్వామిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, తమిళనాడు మంత్రి గాంధీ, గుజరాత్ మంత్రి జితేందర్ చౌదరి, సినీ నటుడు సాయికుమార్, నటి కంగనా రనౌత్, దర్శకుడు అనిల్ రావిపూడి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రముఖులను రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు.
కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు సినీ నటుడు సాయికుమార్ తెలిపారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంలో సినీ ఇండస్ట్రీలో అందరూ ఐకమత్యంగా నిర్ణయం తీసుకుంటే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాను. ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. -నారాయణస్వామి ఉపముఖ్యమంత్రి