ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VIPS AT TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - ap news

TIRUMALA: తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

political-celebrities-visit-tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

By

Published : Dec 5, 2021, 10:45 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎంపీ సీఎం.రమేష్, ఎమ్మెల్సీ ఉమారెడ్డి వేంకటేశ్వర్లు, తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తితిదే మాజీ ఈవో ఎంజీ గోపాల్... స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అంజయ్య చౌదరి మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ఆలయాల నిర్వహణ బాగుందన్నారు. అమెరికాలో కరోనా ప్రభావం తగ్గిందని... పిల్లలకు వ్యాక్సినేషన్​తో పాటు బూస్టర్ డోస్ వేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:JAWAD CYCLONE UPDATES IN AP : తప్పిన ముప్పు.. బలహీనపడిన 'జవాద్'

ABOUT THE AUTHOR

...view details