కళ్యాణి డ్యామ్ పోలీసు ట్రైనింగ్ కళాశాలలో ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ సూర్య భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐజీ సంజయ్, తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ సక్రమంగా సాగాలంటే పోలీస్ వ్యవస్థ కీలకమన్నారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలు, సైబర్ క్రైమ్ నేరాల నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థలోని అన్ని రకాల చట్టాలపై అవగాహన కలిగి, ఎఫ్ఐఆర్ గురించి సమగ్రంగా తెలుసుకుని విధులు నిర్వహించాలని కోరారు.
ట్రైనీ కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతుల ప్రారంభం - police training inauguration latest news
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డాం పోలీస్ శిక్షణ కళాశాలలో ట్రైనీ కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులను ఐజీ సంజయ్ ప్రారంభించారు. రాష్ట్రంలో 6 చోట్ల తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో వ్యవస్థ సక్రమంగా ముందుకు వెళ్లాలంటే పోలీసు వ్యవస్థ కీలకమన్నారు.

రక్షక భటులకు శిక్షణ