చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. మూడు టిప్పర్ వాహనాలను సీజ్ చేశారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై తమకు తెలియజేయాలని ఎమ్మార్వో లోకేశ్వరి ప్రజలను కోరారు.
ఇసుక లోడులను బహిరంగ వేలం ద్వారా విక్రయించి... వచ్చిన సొమ్మును ట్రెజరీలో డిపాజిట్ చేస్తామని చెప్పారు. పాకాల మండల ప్రజలు 28వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ఎమ్మార్వో కార్యాలయంలో జరిగే బహిరంగ వేలానికి హాజరు కావచ్చని చెప్పారు.