ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుయా ఘటనపై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసుల అదుపులో యువతి - రుయా ఘటన తాజా వార్తలు

రుయా ఆస్పత్రి ఘటనపై వ్యాఖ్యలు చేసిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో తన తల్లి ఉందని ఆందోళన చేసిన యువతి.. మెరుగైన వైద్యం అందడం లేదని ఆవేదనలో వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.

ruya incident
పోలీసుల అదుపులో యువతి

By

Published : May 12, 2021, 9:49 PM IST

రుయా ఆస్పత్రి ఘటనపై వ్యాఖ్యలు చేసిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11మంది మృతి చెందిన ఘటనపై హేమవతి అనే యువతి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయగా.. సామాజిక మాధ్యమాలలో అవి వైరల్ అయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో తన తల్లి ఉందని ఆందోళన చెందిన యువతి.. మెరుగైన వైద్యం అందడం లేదని ఆవేదనలో వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో యువతి కోవిడ్ ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. వైరస్ సోకే అవకాశం ఉండటంతో అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. అయితే తన ఆవేదనను చెబుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని సామాజిక మాధ్యమాల్లో పలువురు తప్పుపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details