చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామంలో ఓ యువకుడు మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో... మరో నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో... నిందితుడిని బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణలో ఈ కేసులో మరో నలుగురు మైనర్ బాలురు ఉన్నట్లు గుర్తించి... వారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు అధైర్యపడొద్దని... ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సూచించారు.
పోలీసుల అదుపులో నలుగురు మైనర్లు..! - మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న బాలురను అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు
చిత్తూరు జిల్లా బి.కొత్తపేట మండలం గట్టు గ్రామంలో మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో... నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
![పోలీసుల అదుపులో నలుగురు మైనర్లు..! police take four minors into custody at chittor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5235304-754-5235304-1575199119300.jpg)
మాట్లాడుతున్న మదనపల్లె డీఎస్పీ