మతిస్థిమితం లేని వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు - latest crime news in chittoor district
మహారాష్ట్రలోని వాసం జిల్లా బ్రహ్మ గ్రామానికి చెందిన సుభాష్ రామచంద్ర కోలేకర్ హత్య కేసును ఛేదించినట్లు అలిపిరి సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
మహారాష్ట్రలోని వాసం జిల్లా బ్రహ్మ గ్రామానికి చెందిన సుభాష్ రామచంద్ర కోలేకర్ హత్య కేసును ఛేదించినట్లు అలిపిరి సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. తిరుపతి నగరంలోని చింతలచేను సమీపంలో రైల్వేట్రాక్ పక్కన మతిస్థిమితం లేని సుభాష్ రామచంద్రను కొందరు వ్యక్తులు హత్య చేసినట్లు గుర్తించామన్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి విచారించగా... హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.