ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి పెద్దిరెడ్డిని పోలీసు స్టేషన్​లో విచారణ చేయాలి: వర్ల - attack on judge's brother news

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగుల దాడిని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఖండించారు. ఈ ఘటనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు విచారించాలని వర్ల డిమాండ్ చేశారు.

varla ramaiah
varla ramaiah

By

Published : Sep 28, 2020, 6:31 PM IST

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం ఘటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బైండోవర్ చేసి, పోలీస్ స్టేషన్​కు పిలిపించి విచారణ చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో దళితులపై దాడులకు సంబంధించి సమావేశం జరిగిన మర్నాడే... చిత్తూరులో రామచంద్రపై హత్యాయత్నం జరగటం శోచనీయమని అన్నారు.

ఈ విధమైన సమావేశాలు తమనేం చేయలేవనే సంకేతం జగన్ ప్రభుత్వం ఇస్తోందా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక మంత్రి చెప్పినదానికి తలాడించటం తప్ప... చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details