ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో ఎర్రచందనం దుంగల స్వాధీనం - red sandalwood seized

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు సమీపంలో పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి దాడి నిర్వహించగా స్మగ్లర్లు పారిపోయారు.

red sandalwood logs
పోలీసులు స్వాధీనపరచుకున్న ఎర్రచందనం దుంగలు

By

Published : Oct 23, 2020, 2:06 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్ల జాడ తెలియడంతో అర్ధరాత్రి టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. సాయంత్రం నుంచే శ్రీవారిమెట్టు నుంచి సచ్చినోడి బండ మీదుగా కూంబింగ్ చేపట్టారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా చీకట్లో దుండగులు పారిపోయారు. స్మగ్లర్లు అక్కడ వదిలేసి వెళ్లిన 16 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details