చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. ఐతేపల్లికి చెందిన వెంకటేశ్, నాగార్జున ద్విచక్రవాహనంలో 60 మద్యం బాటళ్లను తరలిస్తూ పట్టుబడ్డారు. వీరు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించి అమ్ముకొంటున్నట్లు విచారణలో తేలింది. పారిపోయిన నాగార్జున వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చంద్రగిరి మండలంలో కర్ణాటక మద్యం పట్టివేత - karnataka alcohol in chandragiri news
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై పోలీసులు మద్యాన్ని పట్టుకున్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రగిరి మండలంలో కర్ణాటక మద్యం పట్టివేత